సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో స్థానిక సుంకర బద్దయ్య వీధిలో బాలాజీ డ్రై క్లీనింగ్ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో స్థానికులు ఆందోళన చెందారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వారు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం సంభవించిందని, బట్టలు పూర్తిగా దగ్ధమయ్యాయని ఫైర్ సిబ్బంది తెలిపారు. బాధితులను నేటి మంగళవారం ఉదయం స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) పరామర్శించారు. బాధితులకు అండగా ఉంటామని ప్రభుత్వ సహకారం కూడా అందించే ఏర్పటు చేస్తామని హామీ ఇచ్చారు.
