సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నారా లోకేష్ TDP యువగళం పాదయాత్రలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో నేడు, ఉండి నియోజకవర్గ పరిధిలోని గ్రామాలలో పాదయాత్ర పూర్తీ చేసుకొని నేటి సోమవారం సాయంత్రం 4 గంటలకు భీమవరం పట్టణ శివారు నరసింహపురం లోని (ఉండి రోడ్ లోని) శ్రీ వెంకటేశ్వర స్వామి మందిరం వద్ద భీమవరం నియోజకవర్గంలోకి అడుగుపెట్టనున్నారు. అక్కడే కాంప్లెక్స్ లో ఆయనకు విడిదికి ఏర్పాటు చేసారు. దానిలో ఉండి , భీమవరం లకు చెందిన నేతలతో నేడు, రేపు శుక్రవారం సాయంత్రం వరకు ఇక్కడ పార్టీ పరిస్థితిఫై నేతల తీరుపై ఆయన సమీక్షలు జరుగుతారు. తదుపరి రేపు,మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి పాదయాత్రగా బయలు దేరి భీమవరం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ కు చేరుకొని సాయంత్రం 6 గంటలకు బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో లోకేష్ కు ఘన స్వాగతం పలకడానికి టీడీపీ నేతలు భారీగా ప్లెక్సీ లు కట్టి పట్టణ రహదారులు అలంకరిస్తున్నారు. ఫై చిత్రంలో చూడవచ్చు. గత 4 ఏళ్ళు పైగా టీడీపీ పార్టీ కార్యాకలాపాలకు దూరంగా ఉంటున్న మాజీ టీడీపీ ఎమెల్య పులపర్తి అంజిబాబు మరల పార్టీ ఫ్లెక్సీ లపై దర్శనమివ్వడం కొసమెరుపు.. ఇటీవల ఈయన రాజకీయ ప్యూహంలో భాగంగా జనసేన పార్టీ నేతలతో కూడా దగ్గరగా ఉంటున్నారు. ఇక లోకేష్ పాదయాత్రలో కీలక పాత్ర పోషిస్తారని భావిస్తున్నారు.
