సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత నెల రోజులు పైగా నరసాపురం పార్లమెంట్ పరిధిలో అన్ని నియోజకవర్గాలను అన్ని గ్రామాలను కవర్ చేస్తూ విస్తృతంగా ప్రజలను కలుస్తూ ప్రచారంలో ముందున్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని, ప్రముఖ లాయర్, గూడూరి ఉమాబాల నేడు, మంగళవారం ఉదయం స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తో కలసి స్థానిక భీమవరం 2 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరలో కల టీ. రంజిత్ కుమార్ నివాసంలో పట్టణంలోని పలువురు అడ్వకేట్ లు తో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా గా గ్రంధి శ్రీనివాస్, ఎంపీ అభ్యర్థిగాగా గూడూరి ఉమాబాలను 2 ఓట్లను వైసీపీ కి వేసి గెలిపించాలని, సీఎం జగన్ నేతృత్వంలో రాష్ట్రంలో జరుగుతున్నా, మహిళా సాధికారత, సామజిక న్నాయం కు , విద్య, వైద్య సహకారం, ప్రజా సంక్షేమం అభివృద్ధికి మేధావులు సహకరించాలని విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, అడ్వకేట్ లు, తదితరులు పాల్గొని తమ సంఘీభావాన్నివారికీ తెలిపారు. తదుపరి, భీమవరం 2 టౌన్ లోని పద్మాలయ రోడ్, రామాలయం వద్ద అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు.
