సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం అంబెడ్కర్ సెంటర్ నుండి -తాడేపల్లిగూడెం వైపు వెళ్లే ప్రధాన రహదారికి టౌన్ రైల్వే గేటు ఇబ్బందులు తొలగించడానికి ఇటీవల సుమారు 18 కోట్ల వ్యయంతో రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా ఆధునిక సాంకేతికత తో కేవలం 7 నెలల వ్యవధిలో శరవేగంగా నిర్మించిన అండర్ టర్నల్ బ్రీజ్ పట్టణ ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతో కీలక పాత్ర పోషించడమే కాదు అదనపు ఆకర్షణగా ఉంది. ఇప్పటికే అనధికారికంగా వాహనదారులు దీని నుండి రాకపోకలు సాగిస్తున్నారు. అయితే ఈ రైల్వే అండర్టన్నెల్ బ్రిడ్జిని కేంద్ర సహాయ మంత్రి మురళీధర్ రేపు శనివారం (ఈ నెల 24న) అధికారికంగా ప్రారంభిస్తారని సమాచారం. అండర్ బ్రీజ్ నిర్మాణంనికి రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ప్రధాన రహదారులను కలుపుతూ నిర్మించదలసిన అపోర్చ్ రోడ్డు నిర్మాణాలు బ్రీజ్ కి రెండు వైపులా ఇంకా నిర్మాణాలు కాకపోవడం ఒక్కటే కాస్త ఇబ్బంది. ప్రస్తుతం ఎదో 10 లారీల మట్టి వేసి తాత్కాలికంగా లెవెల్ చేసారు. ఆర్యూబీ పనులను స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తరచూ వచ్చి పరిశీలించారు. రైల్వే అండర్టన్నెల్ బ్రిడ్జి కి అవసరమైన మేర ప్రభుత్వ పరిధిలో అన్ని అనుబంధ ఏర్పా ట్లు చేయాలని అధికారులకు ఆయన ఆదేశాలు ఇచ్చారు.. అయితే అప్రోచ్ రోడ్డుస్ పని మాత్రం నత్త నడక నడుస్తుంది.
