సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ గత 3 రోజులుగా పట్టణంలో పలు వార్డులలో నిర్మించిన నూతన సీసీ రోడ్లను ప్రారంభిస్తూ పలు శంకుస్థాపనలు చేస్తూ..స్థానికులను మహిళలను వారి సమస్యలను అడిగితెలుసుకొంటున్నారు. దీనిలో భాగంగా 19.40 లక్షల రూపాయలతో శ్రీ కామాక్షమ్మ వారి గుడి రోడ్డు శ్రీనివాస సెంటర్ నుండి మున్సిపల్ కాంప్లెక్స్ వరకు నూతనంగా నిర్మాణం చేసిన సీసీ రోడ్డును పట్టణంలో 34 వ వార్డు నందు నిమ్మకాయల వారి వీధిలో 7 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన సిసి రోడ్డు ను, ఆర్ఆర్ డి ఎస్ కాలేజీ నుండి సూర్య టవర్స్ వరకు 28 లక్షల రూపాయలతో నిర్మించిన సిసి రోడ్ ను ప్రభుత్వ విప్ భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ప్రారంభించారు. నేడు శనివారం ఉదయం స్థానిక 32వ వార్డులో రామాలయం నుండి డంబ్ అండ్ డీప్ స్కూల్ వరకు 38 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేసారు. ప్రారంభోత్సవం నేపథ్యంలో ఆయనతో పాటు ఆ కార్యక్రమంలో గోకరాజు రామరాజు, ఎంపీపీ వెంకట నరసింహరాజు, తోట బోగయ్య, ఏ ఎస్ రాజు స్థానిక యువత పాల్గొన్నారు. భీమవరం పట్టణం అన్ని వార్డులలో కొత్త సిసి రోడ్ల నిర్మాణాలతో అభివృద్ధి లో కళకళ లాడుతుందని .. వందలాది కోట్ల ఖర్చుతో ఒక రోల్ మోడల్ నగరంగా భీమవరం ను తీర్చిదిదేందుకు సీఎం జగన్ కూడా సహకరిస్తున్నారని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. (up Update photo)
