సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈనెల 29వ తేదీన పర్యటనకు వస్తున్న నేపథ్యంలో జిల్లా కేంద్రమైన భీమవరం అభివృద్ధికి సంబంధించి పలు వినతులను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ CM జగన్ దృష్టికి తీసుకొనివెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో నేడు బుధవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా కేంద్రమైన భీమవరం పట్టణాన్ని మోడరన్ సిటీగా అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే పలు చర్యలు తీసుకున్నమని అయితే సీఎం జగన్ నుండి హామీలు పొందేందుకు పట్టణంతో పాటు నియోజకవర్గం అభివృద్ధికి అతి కీలకమైన అంశాలు, అభివృద్ధి పనులకు సంబందించిన అంశాలు ఏవైనా ఉంటె తనకు వాటి వివరాలు ఇవ్వాలని అధికారులను కోరారు. మరిన్ని ప్రతిపాదనలు ఫై, పట్టణంలో పెండింగ్ లో ఉన్న పనులపై సమీక్ష జరిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం శ్యామల, మున్సిపల్ ఎంఈ త్రినాధరావు, హౌసింగ్ డిఇ శివరామరాజు, ఆర్ అండ్ బి ఏఈ లోకేశ్వరరావు, డిఇ రామరాజు, పంచాయతీరాజ్ డిఇ స్వామి నాయుడు, ఏఇలు శ్రీనివాస్, శశి కుమార్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు
