సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం పట్టణంలో అపహరణకు గురైన, పోగొట్టుకున్న సుమారు రూ.25 లక్షల విలువైన 152 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ యు.రవిప్రకాశ్ ప్రకటించారు. భీమవరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పా టు చేసిన మీడియా సమావేశంలో ఈ వివరాలు ప్రకటించారు. నిజానికి మొబైల్ ఫోన్లు,స్మార్ట్ ఫోన్లు పోగొట్టుకున్న ఘటనలపై బాధితుల నుండి ఇప్పటి వరకు 200 ఫిర్యాదులు వచ్చాయన్నారు. వీటికి సంబంధించి 152 ఫోన్లు స్వాధీనం చేసుకుని బాధితులకు అందజేస్తున్నట్లు ప్రకటించారు. ఎవరికైనా ఫోన్ దొరికితే సమీప పోలీస్ స్టేషన్లో అప్పగించాలని, సెల్ ఫోన్ పోగొట్టుకొన్న బాధితుల ఫిర్యాదుల నమోదు కోసం రెండు నెలల క్రితం ప్రత్యేక వాట్సాప్ నంబరును పోలీసు శాఖ అందుబాటులోకి తెచ్చింది. ఫోన్ నంబరు, ఎక్కడ, ఏ సమయంలో పోయిందో తదితర వివరాలను 91549 66503 నంబరుకు వాట్సాప్ ద్వారా పంపాలి. దీనిపై ప్రత్యక పోలీస్ అధికారుల బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు,
