సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో నేడు, సోమవారం సాయంత్రం పంచారామ క్షేత్రమైన శ్రీసోమేశ్వర జనార్ధన స్వామి దేవస్థానం వారి రధం మరియు శ్రీ ఉమా భీమేశ్వర స్వామివారి రధోత్సవాలతో సుమారు 25 వేల మంది భక్తుల శివోహలతో మరు మారుమ్రోగింది.స్థానిక ఎమ్మెల్యే అంజిబాబు జనసేన చినబాబు రధోత్సవాలను 2చోట్ల ప్రత్యక పూజలతో ప్రారంభించారు. మహాశివరాత్రి వేడుకలలో శ్రీ పార్వతి సమేత సోమేశ్వర స్వామి రధోత్సవం వీక్షించడానికి నేటి సాయంత్రం వేలాది భక్తుల మద్య మేళతాళాలు, యువత నృత్యాలు బాణాసంచా కాల్పుల మధ్య పుష్ప, అరటి గెలల అలంకార భూషితమైన సుమారు 40 అడుగుల భారీ రధం ను యువత, చిన్నారులసందడితో మహిళల హారతులతో ,వందలాది భక్తులు లాగుతూ నేటి రాత్రి 7 గంటలకు నాచువారి సెంటర్ కు తీసుకొనివచ్చారు. అక్కడ భక్తులకు ప్రసాద వితరణ జరిగింది. సాయంత్రం 4 గంటలకు రధోత్సవం ప్రారంభంలో ప్రత్యేక పూజలు చేసారు. తదుపరి హరహర శంభో నామ స్మరణ మారుమ్రోగింది.రధోత్సవాన్ని పోలీసులు భద్రతా ఏర్పాట్లను సమర్ధవంతంగా పర్యవేక్షించారు. మరోప్రక్క శ్రీ భీమేశ్వర స్వామి రధోత్సవాన్ని ఘనంగా . 25 అడుగుల రథంతో బాణాసంచా కాల్పుల మధ్య సందడిగానిర్వహించారు. అనేక వందల మంది మహిళలు రథానికి శ్రీ స్వామి దేవేరులు హారతులు ఇచ్చారు. రేపు రాత్రి 2 చోట్ల తెప్పోత్సవాలు పోటాపోటీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది భీమవరం ప్రజలు ఆధ్యాత్మిక అదృష్టం.
