సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్; భీమవరం పట్టణంలో గునుపూడి రిజర్వాయరు పరిధిలో అనగా 12,13,14,15,16 మరియు 17 వార్డులలో ది. 06-02-2023 నుండి ది. 12-02-2023 వరకు నూతనంగా వేసిన అమృత్ పైప్ లైన్ ద్వారా నీటిని సరఫరా ట్రైల్ రన్ చేయుట జరుగుచున్నది. కావున నేటి సోమవారం నుండి ది. 12-02-2023 వరకు ఒక పూట అనగా సాయంత్రం అమృత్ ద్వారా, ఒక పూట అనగా ఉదయం పాత కుళాయి పైపులైను ద్వారా నీటి సరఫరా చేయుట జరుగును. తదుపరి ఈ నెల 13వ తేదీ నుండి పూర్తి స్థాయిలో రెండు పూట్ల నూతన అమృత్ పైపుల నుండి నీటి సరఫరా చేయబడును. కావున ప్రజలు అందరూ అమృత్ పైపులైను ను మీ యొక్క పాత పైపులకుకాని, సంపులకు కాని కనెక్షన్లు ఇచ్చుకొని పురపాలక సంఘానికి సహకరించాలని మునిసిపల్ కమిషనర్ శివరామ కృష్ణ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *