సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలోని అయ్యప్ప దీక్ష తీసుకొన్న స్వాముల కోసం ప్రతి ఏడాది లానే దాతల సహకారంతో ఈ సీజన్లో ప్రతి రోజు అయ్యప్ప భజనలు తో పాటు పవిత్ర సూచికరమైన ‘బిక్ష’ భోజనం కోసం ( ఉచితముగా) D మార్ట్ ప్రక్కన భారీ పందిళ్లల్లో ఏర్పాటు చేసిన విషయం విదితమే..నేడు, శనివారం ఉదయం విజయదశమి పర్వదినం నేపథ్యంలో అక్కడ జరిగిన శ్రీ అయ్యప్ప స్వామి పూజా కార్యక్రమంలో రాష్ట్ర శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు పాల్గొన్నారు. ఆయనకు అక్కడ విచ్చేసిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన అడ్జక్షుడు కొటికలపూడి చినబాబు చేతుల మీదుగా అయ్యప్ప స్వాములు, పలువురు జనసేన నేతలు కలసి ప్రత్యక జ్ఞాపిక అందజేసి సత్కరించారు. మోషేను రాజు మాట్లాడుతూ.. ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున అయ్యప్పలు భక్తి భావంతో ప్రతి రోజు పూజలు భజనలు చెయ్యడం వారికీ అందరికి శ్రమకు ఖర్చుకు లెక్కచేయక బిక్ష వసతి కలుగ జెయ్యడం ఆధ్యాత్మికత ను శాంతి సామరస్యాలను మానవత్వాన్ని పెంపోందిస్తుందని నిర్వాహకులను అభినందించారు.
