సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో నేడు, గురువారం స్థానిక 7వ వార్డు గాంధీ నగర్ లో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ను ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ప్రారంబించారు. ఈ నేపథ్యంలో అక్కడ డాక్టర్స్ ను అభినందించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాదించించడం సీఎం జగన్ సర్కార్ లక్ష్యం అని,, దీనిలో భాగంగా ప్రతి ఒక్కరికి వైద్యం అందుబాటులో ఉండాలన్న లక్ష్యంతో ప్రభుత్వ ఆసుపత్రులలో పాటు ఈ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లను ఏర్పాటు చేస్తున్నామని, ఈ రోజు పట్టణ శివారులోని ప్రజల ఆరోగ్యం కోసం ఈ గాంధీ నగర్ లో ప్రభుత్వ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ను ప్రారంభించడం గర్వముగా ఉందని అన్నారు. ప్రజలు సద్వినియోగ చేసుకోవాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్యామల దేవి, వైద్య అధికారులు, డాక్టర్స్ తో పాటు వైసిపి నేతలు పాల్గొన్నారు.
