సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలోని బివి రాజు మరియు వీరమ్మ పార్క్ ఎదురుగ ఉన్న ‘రాయప్రోలు హెరిటేజ్’ అపార్ట్మెంట్ వాసులు సంయుక్తంగా .. సంక్రాంతి పండుగల నేపథ్యంలో ఏర్పటు చేసిన బొమ్మల కొలువు స్థానిక ఆబాల గోపాలాన్ని విశేషముగా అలరిస్తుంది. రాయప్రోలు భగవాన్ ఆయన సోదరులు శ్రీనివాస మూర్తి ఆధ్వర్యంలో ఏర్పటు చేసిన ఈ బొమ్మల కొలువులో సంక్రాంతి పండుగ నాడు- నేడు అంటూ.. పూర్వము ఎలా జరుపుకునేవారు.. ప్రస్తుత కాలంలో అపార్ట్మెంట్ కల్చర్ వచ్చాక ఎలా మారింది.. ప్రజల వేష భాషలు వ్యవహారిక శైలి లో వచ్చిన మార్పులు చక్కగా విశదీకరిస్తూ చక్కటి బొమ్మల కొలువు ఏర్పాటు చెయ్యడం అభినందనీయం.
