సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ (Avatar The Way Of Water). నేడు అన్ని ప్రధాన భాషలతో పాటు తెలుగులోనూ ఒకేసారి నేడు, శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 3గంటల పైగా నిడివి ఉన్నపటికీ ఏ మాత్రం అంచనాలకు తగ్గకుండా మంచి టాక్ సంపాదించింది. దాదాపు 13 ఏళ్ల క్రితం వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘అవతార్’ కి సీక్వెల్గా . జేమ్స్ కామెరూన్ సృష్టించిన ఈ విజువల్ వండర్ ఈ చిత్రానికి సంబంధించిన ప్రీమియర్ షోలు ఇప్పటికే పడిపోయాయి. భీమవరంలో పట్టణంలో కూడా గతంలో ఏ ఇంగ్లిష్ డబ్బింగ్ సినిమా రిలీజ్ కానీ రీతిలో 6 థియేటర్స్లో 38 షో లతో నేడు ప్రదర్శిస్తున్నారు. వీటిలో AVG మల్టి ఫ్లెక్స్, విజయలక్ష్మి , కిషోర్ 70 ఎం ఎం లలో 3డి వెర్షన్లలో 28 షోలు ప్రదర్శించడం అద్భుత అనుభూతి, టికెట్ ధరలతో 20 రూపాయలు 3Dకళ్ళ జోడు రెంట్ కలిపి 170 రూపాయలకు అందుబాటులో ఉంది. 2డి వెర్షన్ అయితే 150 లోపు ధరలోనే చూడవచ్చు.. 3డి స్క్రీన్స్ టికెట్స్ కు ఆన్ లైన్ లో ఇప్పటికే దాదాపు బుక్ అయ్యాయి.
