సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో ఈ నెల 16వ తేదీన స్థానిక టౌన్ రైల్వే స్టేషన్ వద్ద జరిగిన కిడ్నాప్ కేసును పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు ఛేదించారు. స్థానిక ఆక్వా వ్యాపారి విశ్వనాధుని వెంకట సత్యనారాయణ అలియాస్ నాని కిడ్నాప్ కేసును గత ఆదివారం పోలీసులు సుఖాంతం చేసి.. స్థానిక 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో DSP జయసూర్య మీడియాకు జరిగిన ఘటనలను వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఐదుగురు వ్యక్తులు పరారీలో ఉన్నారు. వారి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి.. గాలింపు చర్యలు చేపట్టారు. భీమవరానికి చెందిన సత్య ప్రసాద్, సురేష్ బాబు వద్ద ఆక్వా వ్యాపారి నాని .. కరోనా సమయంలో 2021 లో కోట్లాది రూపాయలు ‘తక్కువ వడ్డి’కి నగదు తీసుకున్నాడు. అవి వడ్డీతో సహా రూ. 10 .70 కోట్లు అయింది. ఈ మొత్తం నగదు ఇవ్వాలంటూ సత్యనారాయణపై సత్యప్రసాద్, సురేష్ బాబులు తీవ్ర ఒత్తిడి చేశారు. అయితే నాని నగదు ఇవ్వక పోవడంతో.. నగదు ఇచ్చిన బాధితులు ఆవేశంతో నాని కిడ్నాప్‌‌కు ప్రణాళికలు రూపొందించారు. అందుకోసం అనంతపురం జిల్లాలోని లోని కొందరిని సంప్రదించారు. వారు సత్యనారాయణను ఈనెల 16న కిడ్నాప్ చేసి నాని ని కారులోనే చంపేస్తామని బెదిరించారు. దీంతో తన ఆస్తులు విక్రయించి.. నగదు ఇస్తానని హామీ ఇవ్వడంతో.. సత్యనారాయణను కిడ్నాపర్లు భీమవరం ఈనెల 18న తీసుకు వచ్చారు. అప్పటికే ప్యూహం రచించిన పోలీసులు వారి ఆగమనాన్ని గమనించి గరగపర్రు రోడ్డులో కారులో ఉన్న నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి మూడు కార్లు, తొమ్మిది సెల్ ఫోన్లు, వాకిటాకి, చాకు, క్రికెట్ వికెట్లు, హాకీ స్టిక్స్ స్వాధీనం చేసుకున్నారు. ఏది ఏమైనా ఆక్వా వ్యాపారి సత్యనారాయణ అలియాస్ నాని ఫై గతంలో కూడా పలువురికి డబ్బులు ఎగవేతలో వివాదాస్వాద వ్యాపారిగా పట్టణంలో ముద్ర ఉందని పలువురు పేర్కొంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *