సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:భీమవరం వన్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి మాట్లాడుతూ.. భీమవరం గ్రామీణ మండలం తోకతిప్ప గ్రామానికి చెందిన పొన్నాల వీర్రాజు మూడేళ్లక్రితం ఉపాధి నిమిత్తం మస్కట్‌ వెళ్ళారు. ఈనెల 2న హైద్రాబాద్‌ నుండి భీమవరం చేరేసరికి రాత్రి 11 గంటలు అయింది. అంబేడ్కర్‌ సెంటర్లో నిలబడి ఆటో కోసం చూస్తుండగా యలమంచిలి మండలం కాజ గ్రామానికి చెందిన చింతాడ జయరాజు, భీమవరంలోని మెంటేవారితోటకు చెందిన జల్లి సురేంద్ర వచ్చి రూ.500లకు తోకతిప్ప తీసుకు వెళ్లేందుకు కిరాయి మాట్లాడుకున్నారు. వీర్రాజును ఆటోలో ఎక్కించుకున్నాతరువాత పెట్రోలు కొట్టించుకొని, టిఫిన్‌ తిన్నాక వెళదామని, బైపాస్‌ రోడ్డులోని ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్లి బీరు సీసాతో బాధితుడి తలపై కొట్టి గాయపరిచారు. అతని దగ్గర ఉన్న సంచి తీసుకుని ఆటోలోనే ఇద్దరూ పారిపోయారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుపై సీఐ అడబాల శ్రీను దర్యాప్తు చేసి నిందుతులను పట్టుకున్నారు. రూ.1200 నగదు, పాస్‌పోర్టు, సెల్‌ఫోన్‌, వాచీలు, రెండు మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. కేసు వెంటనే చేధించడంలో కీలకంగా వ్యవహరించిన ఎస్‌ఐ వెంకటేశ్వరరావు, కానిస్టేబుళ్ళు లెనిన్‌ ప్రసాద్‌, శ్రీనివాస్‌, కె.నాగేంద్ర, రామకృష్ణ, జోసెఫ్‌, భాస్కరరావును డీఎస్పీ అభినందించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *