సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల భారీ వర్షానికి ఆటోపై చెట్టు కూలిన ఘటనలో భీమవరం నరసయ్య అగ్రహారానికి చెందిన ఆటో డ్రైవర్ ఏలూరి వినోద్ కుమార్‌కు ఆటో మరమత్తుల నిమిత్తం తన వంతు ఆర్థిక సహాయం గా 25,000 అందజేశారు. వర్షాలకు చెట్టు ఆటో పైన కూలిపోవడంతో వినోద్ కుమార్ ఆటో తీవ్రంగా దెబ్బతింది. ఆటో రిపేరుకు డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆటో డ్రైవర్ వినోద్ పరిస్థితి స్థానిక బీజేపీ నాయకులు కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ దృష్టికి తీసుకువెళ్లగా ఆయన మానవత్వంతో వెంటనే స్పందించి తన వ్యక్తిగతంగా ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి అయినంపూడి శ్రీదేవి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు కలిదిండి వినోద్ వర్మ, భీమవరం నియోజకవర్గ కన్వీనర్ కాగిత సురేంద్ర,తదితరులు పాల్గొన్నారు.
