సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమం లో బాగంగా ఈ రోజు ఉదయం భీమవరం లో గల శ్రీ అల్లూరి సీతారామరాజు గారి కాంస్య విగ్రహం వద్ద నుండి నిర్వహించిన 2K మారథాన్ కార్యక్రమాన్ని నేడు, మంగళవారం ఉదయం రాష్ట్ర శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా మరుగున పడిపోతున్న పలు రకాల ప్రాచీన క్రీడలను , విద్యార్థులలో క్రీడాకారుల ప్రతిభను, వారి ఆరోగ్యాన్ని, ప్రోత్సహించడానికి, ఉత్సహ పరచడానికి ప్రభుత్వ గుర్తింపు, బహుమతులు ఇవ్వడం కోసం ‘ఆడుదాం ఆంధ్రా ‘ నేటి నుండి ప్రారంభించడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, మునిసిపల్ కమిషనర్ , శ్యామల పలువురు ప్రముఖులు, విద్యార్ధులు పాల్గొన్నారు.
