సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పవిత్ర కార్తీక మాసంలో నేడు భీమవరం పంచా రామంలో పోటెత్తిన శివభక్తుల మధ్య శ్రీ సోమేశ్వరుని రాష్ట్ర శాసనమండలి చైర్మెన్ మోషేను రాజు దర్శించుకున్నారు. ఆయన గత ఆదివారం రాత్రి భీమవరం సుంకరపద్దయ్య గారి వీధిలో (పెద్ద ఆంజనేయ స్వామి వారి విగ్రహం వద్ద) భారీ స్థాయిలో జరిగిన అయ్యప్ప స్వాముల పడి పూజా కార్యక్రమం లో మరియు కొత్తపూసలమర్రు గ్రామంలో అత్యంత వైభవంగా భారీ శబరిమల సెట్ లో జరిగిన అయ్యప్ప స్వాముల పడి పూజా కార్యక్రమం లో శాసన మండలి చైర్మన్, కొయ్యే మోషేను రాజు పాల్గొన్నారు. ఎంతో నియమనిష్టలతో అయ్యప్ప మాలాధారులు మండలం పాటు చేసే దీక్షలు చేసేవారి కుటుంబాలకు శ్రీ అయ్యప్ప స్వామి కృప, ఆరోగ్యాలు కలగాలని అభిలషించారు. ఆయననను అయ్యప్పలు సత్కరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *