సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం లో గత రాత్రి దీపావళి సంబరాలు, బాణాసంచా వెలుగులు అంబరాన్ని అంటాయి. గత 3 ఏళ్లుగా కరోనా నిబంధనలు, ఆదాయం లేకపోవడం తో దీపావళి రాత్రులు గంటన్నరకే దూకుడు తగ్గిన బాణాసంచా వెలుగులు ఈసారి మాత్రం బాణాసంచా రేట్లు పెరిగినప్పటికీ భీమవరంలో రాత్రి 7గంటల నుండి 10న్నర వరకుప్రతి ఇల్లు దీపపు వెలుగులతో .. ప్రతి వీధి చిచ్చుబుడ్డి, కాకరవత్తి వెలుగులతో , ఆకాశంలోకి వెలుగులు విరజిమ్ముతూ దూసుకుపోతున్న షాట్స్ తో.. ఆకాశం అంత రంగుల వెలుగులతో పందిరి అయ్యింది. నిజానికి గత 6 రోజులుగా పెద్దగా వర్షం కూడా పడక పోవడం మంచి ఎండ కాయడంతో అన్ని వ్యాపారాలు ఉపందుకొన్నాయి .. ఆక్వా మార్కెట్లో చేపలు, రొయ్యలు కూడా రేటు కొంత మేర పెంచుకొన్నాయి, శ్రామికులకు పనులు దొరికాయి.. నిన్న ఉదయం నుండి వ్యాపారస్తులు, జైనులు ఇతర ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఇక్కడ స్థిరపడినవారు వారి ఆచారాలను అనుసరించి లక్ష్మి పండుగ మొదలు బాణాసంచా కాల్పులవరకు పోటీ పడ్డారు. భీమవరంలో ధన త్రయోదశి నుంచి జ్ఞానపంచమి వరకు వేడుకలు నిర్వహిస్తారు. జైనుల పుణ్యక్షేత్రం పాలరాతి దేవాలయం పెదమిరంలో వేడుకలు స్వయం భువుడు శ్రీ ఆదినాధ్ గురువుకు ప్రత్యక పూజలు ఘనంగా నిర్వహించారు.( ఫై చిత్రంలో ద్విదప్యమానంగా వెలిగిపోతున్న భీమవరం పట్టణం )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *