సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సంక్రాంతి పర్వదినాలు ముగిసాయి. ఇక బంధుమిత్రులకు వీడ్కోలు పలుకుతూ తిరిగి తమ ప్రాంతాలకు వెళుతున్న వారితో గత 2 రోజులుగా భీమవరం ఆర్టీసీ బస్సు స్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. 16, 17, 18 తేదీల్లో స్పెషల్ సర్వీసులు నడిపారు ( ఫై చిత్రంలో చూడవచ్చు). అయితేనిన్న , గురువారం, నేడు, శుక్రవారం మరింత రద్దీ పెరిగింది. ఏలూరు, విజయవాడ, అమలాపురం, వంటి ప్రాంతాలకు బస్సు రావడం ఆలస్యం ప్రయాణికులు తమకు సీటు దొరకదేమో అన్న భయంతో బస్సులను చుట్టుముట్టేసున్నారు.( ఫై చిత్రంలో చూడవచ్చు). దీనితో సంక్రాంతి పండుగ సీజన్ ఆర్టీసీకి బాగానే కలసి వచ్చింది. పండుగ కు ముందు ఆదాయం బాగుంది. అలాగే పండుగ ముగిసిన తర్వాత కూడా ఆదాయం మరింత అదనంగా రావడంతో ఆర్టీసీ వర్గాల్లో సంతృప్తి వ్యక్తం అవుతోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో గత గురువారం ఒకరోజే జిల్లాలోని నాలుగు డిపోల నుంచి తిరిగిన రెగ్యులర్ సర్వీసులకు మొత్తం రూ.58 లక్షల 64 వేల 801 వచ్చింది. డిపోల వారీగా చూస్తే భీమవరం డిపో రూ.17 లక్షల 94వేల 338, తణుకు రూ.17లక్షల 95 వేల 503, నరసాపురం రూ.12 లక్షల 53 వేల 136, తాడేపల్లిగూడెం డిపోకు రూ.10లక్షల 21 వేల 824లు ఆదాయం వచ్చింది. పండుగ తర్వాత తిరుగు ప్రయాణంలో ఈ స్థాయిలో ఆదాయం రావడం ఇదే మొదటిసారి అని అంటున్నారు.
