సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, గురువారం దసరా వేడుకలలో పవిత్ర దుర్గాష్టమి నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరం లోని పంచారామ క్షేత్రం మరియు శ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయంలోని శ్రీ అమ్మవారిని దర్శించుకొని అస్సిసులు పొందటం జరిగింది. గునుపూడిలోని పవిత్ర పంచారామక్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వార్ల దేవస్థానము నందు దసరా ఉత్సవములు సందర్భముగా నేడు గురువారం శ్రీ పార్వతి అమ్మ వార్కి దుర్గాదేవి అలంకరణ, శ్రీ అన్నపూర్ణ అమ్మవార్కి వనదేవత గా అలకరించుట జరిగినది. ఈ సందర్భముగా శ్రీమతి సి.నాగరాణి శ్రీ అమ్మవారిని దర్శించుకొనగా, ఆలయం అర్చకులు పూజా కార్యక్రమం నిర్వహించటమైనది( ఫై ఫోటో). ఈ కార్యక్రమం నందు జిల్లా దేవదాయ శాఖ అధికారి శ్రీ ఇ.వి.సుబ్బరావు , దేవాలయ అర్చకులు పాల్గొనియున్నారు
