సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గంలో విద్వేషాలను రేకెత్తించేలా, శాంతిభద్రతలకు భంగంవాటిల్లేలా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ని కించపరుస్తూ వైసిపి ప్రోద్బలంతో నియోజకవర్గంలో ప్రధాన సెంటర్లలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను వెంటనే తొలగించి రాష్ట్రంలో శాంతిభద్రతలను రక్షించాలని జనసేన పార్టీ పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు,భీమవరం నియోజకవర్గం ఇంఛార్జి, కొటికలపూడిగోవిందరావు డిమాండ్ చేస్తూ జనసేన పార్టీ ముఖ్య నాయకులు తో కలసి స్థానిక కలెక్టరేట్ లో పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్, ప్రశాంతికి, మున్సిపల్ కమిషనర్ కి, డిఎస్పీ కి లిఖిత పూర్వకంగా వినతిపత్రం అందజేశారు. అనంతరం గోవిందరావు మీడియాతో మాట్లాడుతూ.. వైసిపి ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగానే ఇలాంటి ఫ్లెక్సీ లు కట్టి జనసేన ను కవ్వించే చర్యలకు పాల్పడుతోందని ఇది సమాజానికి మంచిదికాదని అధికారపార్టీని హెచ్చరించారు.రెచ్టగొట్టాలని చూస్తే అధికారపార్టీ నేతలకు ప్రజాస్వామ్యయుతంగా బుద్ధి చెబుతామన్నారు. బ్యానర్లతో, మోటారు సైకిళ్ళతో ర్యాలీగా వెళ్తూ పట్టణప్రజలను వైసిపి కార్యకర్తలు భయభ్రాంతులకు గురిచేసినా అడ్డుకోని పోలీసులు జనసేన నాయకులు కలెక్టర్ కు వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తుంటే కూడా అడ్డుకోవడం మంచి పద్దతి కాదని ఆరోపించారు. ఈ ఫ్లెక్సీలపై అధికారులు స్పందించకుంటే తదుపరి కార్యాచరణ చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు వేగేశ్న కనకరాజు సూరి, జుత్తిగ నాగరాజు, బండి రమేష్ కుమార్, మోకా శ్రీనివాసరావు, జవ్వాది బాలాజీ, వైస్ ఎంపీపీ అడ్డాల రాము,ఎంపిటిసి గుల్లిపల్లి విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
