సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్రంలో జగన్ సర్కార్ రైతుల వద్ద మిగిలిన ధాన్యం కొనాలని అధికారులను ఆదేశిస్తూ రైతు భరోసా కేంద్రాలకు రెండో దఫా అనుమతి ఇచ్చిన ఇంకా కొనవలసిన ధాన్యం కొందరు రైతుల వద్ద మిగిలే ఉంది. దీంతో ధాన్యం అమ్ముడుకాకపోవడంతో సొమ్ము లేక నారుమడులు ఆలస్యం కావడం అదికాస్తా నాట్లు ఆలస్యానికి దారి తీసిందని కొందరు రైతులు చెబుతున్నారు. నిబంధనల ప్రకారం జనవరి మొదటి వారంలోపే నాట్లు పూర్తవ్వాలి. ఆ లెక్కన సాగు జరిగితేనే దిగుబడులు వస్తాయి. అలాంటిది ఏకంగా నెలరోజులు నాట్లు ఆలస్యం దిగుబడికి ఎంత నష్టం చేకూరుస్తుందోనన్న భయం రైతుల్లో ఉంది. భీమవరం మండలంలో తుందుర్రు, బేతపూడి, తాడేరు, తదితర ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే నాట్లు ఉపందుకొన్నాయి. వీరవాసరం మండలంలో వీరవాసరం, తలతాడితిప్ప, బొబ్బనపల్లి, ఆయకట్టుల్లో కొందరు రైతుల వద్ద ఇంకా ధాన్యం నిల్వ ఉండిపోయింది.. ఆచంట మండలంలోనూ ఇదే పరిస్థితి. మండలంలో ఇంకా పలు గ్రామాలకు సంబంధించి సుమారు 4 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది. మిగిలిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
