సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలోని మల్టి ఫ్లెక్స్ వెనుక ఉన్న పంక్షన్ హాలులో .. పశ్చిమ గోదావరి జిల్లా కూటమి పార్టీల నేతల సమావేశం నేడు, శనివారం ఉదయం జిల్లా ఇంచార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ అడ్జక్షతన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ముఖ్య అతిధిగా నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి నిమ్మల, స్థానిక ఎమ్మెల్యే, అంజిబాబు , ఉండి ఎమ్మెల్యే రఘురామా, తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ, తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి, నరసాపురం ఎమ్మెల్యే, నాయకర్ లతో పాటు జిల్లాలోని పార్టీల ప్రముఖులు పాల్గొన్నారు. జిల్లాలో పార్టీ నేతలతో జిల్లాలోని వివిధ అంశాలపై చర్చించారు. పలువురు జనసేన, బీజేపీ నేతలు జిల్లాలో ‘తమ క్యాడర్ ల కు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని’ అందరు కలసి ఉండేలా మీరు కృషి చెయ్యాలని మంత్రి గొట్టి పాటి కి విజ్ఞప్తి చేసారు. త్వరలో జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు నీటి సంఘాల ఎన్నికలు, సహకార సంఘాల ఎన్నికలు జరగనున్నాయన్నారు. వాటికీ సన్నద్ధం కావాలని, అన్ని కూటమి పార్టీల నేతలకు తగిన ప్రాధాన్యత ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు.. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లాలనేదానిపై చర్చించామన్నారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వ నాశనమైందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యుత్తు సమస్యలు ఉన్నాయని, అలాగే జిల్లాలో రోడ్ల సమస్య ఉందని ప్రజాప్రతినిధులు తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. ప్రతి ఏడాది విద్యుత్తు వినియోగం పెరుగుతోందని, దానికి అనుగుణంగా ఉత్పత్తి పెంచాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ఎక్కడా స్మార్ట్ మీటర్లు పెట్టలేదని, కేవలం వైసీపీ తమ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. జిల్లాలో అభివృద్ధికి కూటమి కృషి చేస్తుందని .. ఇటీవల రోడ్ల అభివృద్ధికి కేంద్రం నుండి వందల కోట్ల నిధులు సాధించామని నా వంతు మరింత కృషి చేస్తానని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ హామీ ఇచ్చారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *