సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు క్యాంప్ కార్యాలయంలో నేడు, శుక్రవారం 21వ అఖిల భారత పశుగణన కార్యక్రమ పోస్టర్ ను ఎమ్మెల్యే అంజిబాబు ఆవిష్కరించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ,, 21వ అఖిల భారత పశుగణన కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 2, 2025 వరకు జరుగుతోందని, గేదెలు, ఆవులు, గొర్రెలు, మేకలు, పందులు, గుర్రాలు, పోనీస్, గాడిదలు, మిధిన్స్, యాక్స్, కంచరగాడిడలు, ఒంటెలు, ఏనుగులు, కుక్కలు, కుందేళ్ళు అలాగే పక్షిజాతులలో కోళ్ళు, బాతులు, టర్కీకోళ్ళు, ఇతర కోడి జాతి పక్షుల వివరాలను ఈ పశు గణనలో సమాచారం సేకరించిన జరుగుతుందన్నారు. మీ ఇంటికి వచ్చి పశువుల సమాచారాన్ని సేకరించే వారికి సహకరించాలని, తద్వారా పథకాల రూపకల్పనకు వీలవుతుందని అన్నారు. 16 రకాల పెంపుడు జంతువుల సమాచారాన్ని సేకరిస్తారని, రాష్ట్రవ్యాప్తంగా పశుగణన పూర్తయిన ఇంటి తలుపుపై స్టిక్కర్ కూడ అంటించనున్నారని, రైతులు కచ్చితంగా వివరాలు నమోదు చేయించుకోవాలని అన్నారు. కార్యక్రమాలో జిల్లా పశు సంవర్ధక శాఖాధికారులు, వబిలిశెట్టి రామకృష్ణ, ఆకుల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
