సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం ఏర్పాటయి 100 రోజులు పూర్తీ చేసుకొన్నా నేపథ్యంలో భీమవరం లో జనసేన ఎమ్మెల్యే అంజిబాబు ఆధ్వర్యంలో స్థానిక 6వ వార్డు బొక్కవారి పాళెము లో ‘ ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం జరిగింది. దీనిలో అంజిబాబు మాట్లాడుతూ.. చంద్రబాబు , పవన్ కళ్యాణ్ నేతృత్వంలో, కేంద్రంలోని బీజేపీ సహకారంతో ప్రజల ఆకాంక్షలకు, అవసరాలకు అనుగుణంగా పనిచేస్తూ, రాష్ట్రంలో 100 రోజుల పరిపాలన పూర్తిచేసుకున్న సందర్భంగా” ఇది మంచి ప్రభుత్వం ” పేరిట ప్రజల మధ్యకు వెళ్లి మా కూటమి ప్రభుత్వ అభివృద్ధి విశేషాలు ప్రజలు సమస్యలు తెలుసుకొంటున్నామని దీనిలో బాగంగా మొదటి సభ ఇక్కడి నుండి ప్రారంభించామన్నారు. నేడు శుక్రవారం 20వ తేదీ నుండి నుండి 26వ తేది వరకు ప్రతి రోజూ ఉదయం 10.30 గంటల నుండి భీమవరం నియోజకవర్గంలో గ్రామాలు మరియు వార్డులలో జరిగే సమావేశాలలో తాను మరియు కూటమి నేతలు ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొంటారని అందరు సహకరించాలని పిలుపు ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *