సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గంలో పేదలకు ప్రభుత్వ సహకారంతో ఇళ్ల నిర్మాణాలు, ప్లాట్లు పూర్తి చేసేందుకు లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ హౌసింగ్ అధికారులను ఆదేశించారు. నేడు, శుక్రవారం హౌసింగ్ పీడీ రామరాజు, డీఈ వెంకటరమణ లతో తన స్థానిక క్యాంపు కార్యాలయంలో గృహ నిర్మాణాలపై సమీక్షించారు. ఇప్పటి వరకు లబ్ధిదారులు ఎన్ని గృహాలను నిర్మించారు, నిర్మించడానికి మరియు మరిన్ని ఎన్ని బేస్మెంట్ స్థాయిలలో నిర్మించారు,విస్సాకోడేరు లేఅవుట్‌లో ప్రస్తుత గృహ నిర్మాణాలు,..అన్నది సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ..ప్రతి ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం 80 లక్షల రూపాయలను ఉచితంగా అందజేస్తుందన్నారు. అంతే కాకుండా బ్యాంకుల ద్వారా 35 వేల వరకు రుణాలు కూడా ఇస్తున్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని సొంత ఇంటి కలను సాకారం చేసుకోవాలని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కోరారు. అంతే కాదు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా ఎక్కడా రాజీపడకుండా కరోనా వంటి విపత్తులో కూడా ఎక్కడా రాజీపడకుండా ప్రభుత్వ భూములు, ప్రైవేటుగా సేకరించిన భూములు, ప్లాట్లు ఇల్లు లేని ప్రజలకు పంపిణీ చేశామన్నారు. అదేవిధంగా ఇళ్లు నిర్మించుకుంటున్న వారికి జాప్యం లేకుండా బిల్లులు మంజూరు చేయాలనిఅధికారులను ఆదేశించారు. .
· ·
