సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఫై చిత్రంలో చూస్తున్న 70 ఏళ్ళ ఫై బడిన ఈ పేద వృద్ధ దంపతులు పేర్లు దొకల నాగన్న. అప్పయ్యమ్మ లది ఒక దీనగాథ.. వీరు చెప్పిన వివరాలు ప్రకారం.. వీరికి ముగ్గురు సంతానం. ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి.. ఎదో కులో నాలో చేసుకొని వీరి కుటుంబాన్ని అలా సాకుతూ వీరి కష్టార్జితం తో గునుపుడి చేగిడిల పేట లో సెంటినర స్థలం సంపాదించారు. అక్కడే జీవనం సాగిస్తున్న వీరికి వయస్సు మీద పడటం తగిన ఆదాయం లేకపోవడంతో .. వారిని చూసుకొంటానని చెప్పి వాళ్ల చిన్న కొడుకు దోకల సోమన్న అనే వ్యక్తి వారికున్న పెద్ద ఆధారం.. ఆ కొద్దిపాటి ఆస్థి రాయించుకొని కొన్ని రోజులు తరవాత వాళ్ల ను కొట్టి బయటకు గెంతీసాడు అని వాళ్ళ కోణంలో ఆరోపిస్తున్నారు. అధికారులు తమకు న్యాయం చేసి మా స్థలం మాకు ఇప్పించాలి అని ప్రాధేయపడుతున్నారు. శరీరం సహకరించటం లేదు .. తాము ప్రస్తుతం తమ కూతురు, అల్లుడు ఇంటి వద్ద తాత్కాలిక ఏర్పాటులో చేగిడిలా పేటలోని ఉంటున్నామని ..వారి పరిస్థితి అంతంత మాత్రమే నని వారికీ భారంగా ఉండలేమని తమకు తగిన జీవనోపాధి కల్పించాలని వారు కోరుతున్నారు. తమ స్థలం తమకు ఇప్పించాలని దీనిపై కొందరు స్థానికుల సహకారంతో భీమవరం RDO గారికీ 2023 ఆగస్ట్ నెలలో పిర్యాదు చేసినప్పటికీ …ఆయన ఆఫీస్ కు 2సారులు వెళ్లినప్పటికీ ఎందువలనో వారికి న్యాయం జరగలేదు ఆరోపిస్తున్నారు. (బహుశా చట్టబద్ధంగా సంతానానికి రాసేసిన ఆస్థి కావడం.. చిన్న కొడుకు కూడా ఆర్ధిక సమస్యలతో సతమతం కావడం ? ) కాబ్బటి మానవతా దృక్పధం తో అటు ప్రభుత్వ అధికారులు ఇటు స్వచ్చంధ సంస్థలు తమ వంతు సహకారంగా ఆ వృద్ధ దంపతులకు చేదోడుగా నిలిచి సహకరించవలసిన సమయం ఇది.. వాళ్లకు సెల్ ఫోన్ కూడా లేదు.. ఇతర వివరాలకు వారి అల్లుడు కిలపర్టి అప్పారావు. సెల్ నంబర్.9878648871 ను అడిగి వాస్తవ వివరాలు తెలుసుకోవచ్చు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *