సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మాజీ సీఎం జగన్ భీమవరం పర్యటన ఖరారు అయ్యింది. ఆయన ఈనెల 13వ తేదీ (ది 13/08/2025) మధ్యాహ్నం 3.00 గంటలకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే పుప్పాల శ్రీనివాసరావు (వాసుబాబు) వారి కుమార్తె వివాహా వేడుకలో పాల్గొనుటకు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత, వైఎస్ జగన్మోహన్ రెడ్డి భీమవరం లోని VSS గార్డెన్స్ ఫంక్షన్ హాల్ కి విచ్చేయుచున్న సందర్భంగా హెలిప్యాడ్ వద్ద జరుగుచున్న ఏర్పాట్లను స్థానిక వైసీపీ నేతలు మరియు రాష్ట్ర శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు, మాజీ ఎమ్మెల్యే వాసుబాబు, భీమవరం నియోజకవర్గ ఇంచార్జ్ చినిమిల్లి వెంకట్రాయుడు YSRCP పట్టణ అధ్యక్షులు గాదిరాజు రామ రాజు, వేండ్ర వెంకట స్వామి తదితరులు పరిశీలించారు. ఇటీవల ఎన్నికల తరువాత మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న గ్రంధి శ్రీనివాస్ పార్టీకి రాజీనామా చేసి రాజకీయాలకు దూరం కావడంతో ఆయన ప్రభావం ఉన్న భీమవరం, ఉండి నియోజకవర్గాల లో వైసీపీ జోష్ తగ్గడం తదుపరి పరిణామాల నేపథ్యంలో జగన్ శుభ కార్య పర్యటనలో పనిలో పనిగా స్థానిక నేతలతో కీలక భేటీ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *