సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బాలలకు సంబంధించిన గుండె వ్యాధులకు ఉచిత వైద్య శిబిరం ను ఈనెల 26వ తేదీ వచ్చే మంగళవారం ఉదయం మేంటేవారి తోటలోని అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ వైద్య సహాయ కేంద్రం (సుందరయ్య భవనం)లో నిర్వహించనున్నారు .. వసుధ ఫౌండేషన్ వారి సహకారంతో విజయవాడ ఆంధ్రా హాస్పిటల్ కు చెందిన పిల్లల గుండె వైద్య నిపుణులు డాక్టర్ కె.విక్రమ్ (ఇంటర్ వెన్షనల్ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్) 15 సంవత్సరం లోపు వయసు ఉన్న పిల్లలను పరిశీలించి,2D ఎకో పరీక్షలు నిర్వహించి ఉచిత వైద్య చికిత్సలు అందిస్తారు.. ఈ వైద్యశిబిరం ను భీమవరం పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని వసుధ ఫౌండేషన్ కన్వీనర్ ఇందుకూరి ప్రసాదరాజు కోరారు.. వివరాలకు 99490 93115 ఫోన్ చేసి తెలుసుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *