సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలోని మెంటే వారి తోటలోని సుందరయ్య భవనం లో ఈనెల 27వ తేదీ ఆదివారం ఉదయం 9గంటల నుండి .. పక్షవాతం, పిట్స్ బిపి, షుగర్ వ్యాధిగ్రస్తులకు వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని దీనిని అవసరమైన వారు వినియోగించుకోవాలని అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ సేవా విజ్ఞాన కేంద్రం కన్వీనర్ రాధాకృష్ణ, వసుధ ఫౌండేషన్ కన్వీనర్ ఇందుకూరి ప్రసాదరాజు లు కోరారు. అందరికీ వైద్య సహాయం అందించాలన్న ఆలోచనతో అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ వైద్యశాల కేంద్రంలో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు విజయవాడకు చెందిన డాక్టర్ గోపాలం శివన్నారాయణ గారి క్యాంపు లో మన హాస్పిటల్స్ వైద్యులు డాక్టర్ డి,సందీప్ వర్మ తదితరులు పాల్గొని వైద్య సేవలు అందిస్తారన్నారు. తక్కువ ధరలకే అవసరమైన మందులను నెలలవారీగా అందిస్తారన్నారు. వైద్య శిబిరం లకు వచ్చేవారు ముందురోజు బీపీ ,షుగర్ పరీక్షలను బయట చేయించుకుని ఆ రిపోర్టులు తీసుకొని మెడికల్ క్యాంపుకు రావాలన్నారు .అలాగే పాత రిపోర్ట్ లను ,వాడే మందులను కూడా తీసుకురావాలన్నారు
