సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈ జూన్ 29న జరుగుతున్న జాతీయ లోక్ అదాలత్ లో కేసుల పరిష్కారం నిమిత్తం నేడు, శుక్రవారం సాయంత్రం పోక్సో కోర్టులో స్ధానిక న్యాయవాదులు, పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.భీమవరంలోని ఫోక్సో కోర్టు న్యాయమూర్తి N. సోమశేఖర్ మాట్లాడుతూ.. “పోలీసు అధికారులు, న్యాయవాదులు కోర్టుకు మరియు కక్షిదారులకు మధ్య వారధిగా ఉండి జాతీయ లోక్ అదాలత్ యొక్క ప్రాముఖ్యతను కక్షిదారులకు తెలియజేయాలని, జూన్ 29న జరిగే జాతీయ లోక్ అదాలత్ లో ఎక్కువ కేసుల రాజీకి కృషి చేయాలని, ప్రతి రోజూ అన్ని కోర్టుల్లో ప్రీ లోక్ అదాలత్ సిట్టింగ్ లు జరుగుతున్నాయని, న్యాయమూర్తుల సమక్షంలో కేసుల రాజీకి ప్రయత్నించాలని” అన్నారు.ఈ సమావేశంలో సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) B. అప్పల స్వామి, ప్రిన్సిపల్ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) G. సురేష్ బాబు, 1వ అదనపు సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) P. హనీషా, 2వ అదనపు సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) D. ధనరాజు, DSP V.నారాయణ స్వామి రెడ్డి, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, కోర్టు కానిస్టేబుల్స్, న్యాయవాదులు K.జ్యోతి, V.V.సుబ్బారావు, R. సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.
