సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో స్థానిక మారుతి సెంటర్ లో 8 దశాబ్దాలకు పైగా మహిమానిత మూర్తిగా పేరొందిన శ్రీ దాసాంజనేయ స్వామివారి దేవాలయంలో ఈ నెల 5వ తేదీ సోమవారం నుండి 42వ శ్రీ హనుమద్ర్వత వార్షికోత్సవాలు ను ప్రారంభిస్తున్నారు. 5వ తేదీన ఉదయం 9గంటలకు శ్రీ స్వామివారి నగరోత్సవం వేడుకగా పురవీధుల గుండా నిర్వహిస్తారు. దీనిని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ప్రారంభిస్తారని ఆలయ ధర్మకర్తలమండలి సభ్యులు మరియు చైర్మెన్, పరుచూరి చిన నాగేశ్వరరావు తెలిపారు.విశిష్ట అతిధులుగా మంత్రి కొట్టు సత్యనారాయణ, మండలి చైర్మెన్ కొయ్యే మోషేనురాజు ను ఆహ్వానించారు. ఉదయం 11గంటల నుండి 108 బిందెల ఆవుపాలతో, వివిధ ఫల రసాలతో పంచామృతాలతో అభిషేకాలు ప్రారంభిస్తారు,సాయంత్రం 1300అరటిపళ్ళు, సామూహిక లక్ష తమలపాకుల పూజలు నిర్వహిస్తారు. లైటింగ్ సుందరీకరణ, పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఈ నెల 9వ తేదీవరకు ఈ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 13వ తేదీన భక్తులు దాతల సహకారంతో ఆలయ ఆవరణలో అఖండ అన్నసమారాధన నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వాహణ అధికారి గొట్టుముక్కల నాగ సీతారామరాజు తెలిపారు.
