సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ‘ డిపార్ట్మెంట్స్ అఫ్ స్కిల్స్ మరియు ట్రైనింగ్’ వారు భీమవరంలో ఈనెల 13వ తేదీ న స్థానిక డీఎన్ఆర్ డిగ్రీ కళాశాల లో నిరుద్యోగుల కోసం నిర్వహిస్తున్న భారీ జాబ్ మేళ నిర్వహిస్తున్నట్లు కళాశాల పాలకవర్గం వైస్ ప్రిన్సిపాల్ గోకరాజు పాండురంగ రాజు..మన సిగ్మా న్యూస్ కు తెలిపారు. ఈ జాబ్ మేళాలో దేశంలో ప్రఖ్యాత 21 కంపెనీ లు పాల్గొని మొత్తం 1270 జాబ్స్ ను ఎంపిక చేస్తాయని , నెలవారీ జీతం 11వేల రూపాయలు నుండి 30 వేల వరకు ఉంటుందని ,వయస్సు 18 ఏళ్ళ నుండి 35 ఏళ్ళు మధ్య ఉండే అభ్యర్థులు అర్హులు అని విద్య అర్హత 10వ తరగతి నుండి ఏదేని డిగ్రీ వరకు చదివి ఉండవచ్చునని తెలిపారు.ఈ ఉద్యోగమేళా నిర్వహించు సమయం ఉదయం 9 గంటల కు ప్రారంభమౌతుంది. .ఆసక్తిగల అభ్యర్థులు ఈ క్రింది లింక్‌తో హాజరు కావడానికి మరియు నమోదు చేసుకోవడానికి పై ఫ్లైయర్లోని కంపెనీని ఎంచుకోవచ్చు: bit.ly/43biYYa గమనిక: అభ్యర్థులు తప్పనిసరిగా రెజ్యూమె కాపీలు మరియు క్వాలిఫికేషన్ క్రెడెన్షియల్స్ కాపీలతో ఫార్మల్ డ్రెస్‌లో హాజరు కావాలి. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి: కె.నాగేంద్ర (ESc కో-ఆర్డినేటర్) – 8919684670
ప్రసన్న (ESc కో-ఆర్డినేటర్) – 7013896277(లేదా)APSSDC హెల్ప్‌లైన్ – 9988853335.
