సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వచ్చే మార్చి నెల 19న భీమవరం లోని స్థానిక శ్రీభీమేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీవిజ్ఞానవేదిక జరిగే ఉగాది పురస్కార వేడుకల బ్రోచర్ ను నేడు, ఆదివారం అది ఎమ్మెల్యే అంజిబాబు వారి కార్యాలయంలో ఆవిష్కరించారు. . మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకఉగాది పండుగ అంటే అందరూ ఎంతో సంతోషంగా ఆనందంగా జరుపుకునే పండుగ అని అన్నారు. మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు భవితరాలకు తెలియజేస్తూ గత 40 ఏళ్లుగా ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఉగాది వేడుకల కమిటీ కన్వీనర్ చెరుకువాడ రంగసాయి, ఉపాధ్యక్షులు అరసవల్లి సుబ్రమణ్యం మాట్లాడుతూ.. మార్చి 19న జరిగే ఉగాది వేడుకల్లో జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ స్వచ్ఛంద సంస్థలలో విశేష సేవలందిస్తున్న వారికి ఉగాది ప్రతిభ పురస్కారాలను అందిస్తున్నామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *