సిగ్మాతెలుగు డాట్, ఇన్, న్యూస్: ప్రస్తుతం సీజనల్ జ్వరాలతో ప్రజలు అస్వస్థతకు గురై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో జమాతే ఇస్లామీ హింద్, భీమవరం పట్టణ శాఖ వారు నేడు, శుక్రవారం మొదటి దశలో భాగంగా సుమారు 400 మందికి డెంగ్యూ, చికన్ గునియా నివారణ కొరకు ఉచితంగా హోమియో మందులను స్థానిక పెద్ద మసీదు వద్ద పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ముస్లిమ్స్ కమిటి ప్రెసిడెంట్ షేక్ రబ్బానీ పాల్గొని నిర్వాహకులకు కృతజ్ఞ్తతలు తెలియజేసారు. అనంతరం జమాతే ఇస్లామీ హింద్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎండి సిద్దీఖ్ మాట్లాడుతూ .. జమాతే ఇస్లామీ హింద్ సంస్థ ఒక జాతీయ స్థాయి సంస్థ అని, అది స్థాపించిన నాటి నుండి ఇప్పటి వరకు అనేక సాంఘిక సేవా కార్యక్రమాలను చేపడుతున్నామని, . కరోనా మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు అనేక కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దేశవ్యాప్తంగా వలస కార్మికులను ఆదుకోవడం జరిగిందని, కరోనా బాధితులకు ఉచితంగా మందులు, భోజనం అందజేయడం జరిగిందని, కరోనాతో చనిపోయినా వందల శవాలకు అంత్యక్రియలు చేయడం జరిగిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. భూ వాసులపై కరుణ చూపు, నీపై ఆకాశవాసి కరుణ చూపుతాడు అన్న ఇస్లాం బోధనను స్ఫూర్తిగా తీసుకోని పనిచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి . షేక్ ఇంతియాజ్, షేక్ అక్బర్ హుస్సేన్, షాబు , తదితరులు పాల్గొన్నారు.
