సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లో శ్రీకృష్ణజన్మాష్టమి వేడుకలు గత సోమవారం ఘనంగా జరిగాయి. పలు ప్రాంతాలలో ఇస్కాన్ మందిరంలో నేడు మంగళవారం కూడా వేడుకలు కొనసాగుతున్నాయి. భీమవరం లో గత సాయంత్రం నుండి రాత్రి 10 గంటల వరకు వాడవాడలా ఉట్టి ఉత్సవాలు ఘనంగా నిర్వహించి పిల్లలకు, పెద్దలకు, మహిళలకు వేరువేరుగా ఉట్టి ఉత్సవాలు నిర్వహించడం,ప్రసాద వితరణ చెయ్యడం జరిగింది. ఉట్టి కొట్టినవారికి బహుమతుల ప్రధానం తో పాటు శ్రీ కృష్ణుని ప్రతిమలను కానుకగా ఇవ్వడం జరిగింది. గత రాత్రి పంచా రామం, శ్రీ ఉమా భేమేశ్వర స్వామి దేవాలయం వద్ద, దుర్గాపురం , పాత బస్ స్టాండ్, బుధవారం మార్కెట్ వద్ద , స్వర్ణ సాయి మందిరం వద్ద పెద్ద కోలాహలం తో ఉట్టి వేడుకలు జరిగాయి. చిన్నారులతో గోపిక, యశోద, కృష్ణుని వేషధారణ ప్రదర్శనలు జరిగాయి.
