సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు రెండో దశ ఉద్యమ కార్యాచరణలో భాగంగా ప్రభుత్వ కార్యాలయాలలో విధి నిర్వహణలో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరై నిరసన తెలిపారు. కలెక్టర్ ప్రశాంతికి ఉద్యోగుల సమస్యలపై నల్ల మాస్కులు ధరించి వినతిపత్రం అందజేశారు. జేఏసీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి కృష్ణమోహన్‌రావు మాట్లాడుతూ.. జేఏసీ నిర్ణయం మేరకు ఈనెలాఖరు వరకు ఈ ఉద్యమం జరుగుతుందని, ఈలోగా రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరిస్తే మంచిదన్నారు. తమ డిమాండ్లలో ముఖ్యము గా సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరిద్ధరించాలని, డీఏ బకాయిలు మంజూరు చేయాలని, జిల్లా కేంద్రాలలో పనిచేస్తున్న ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏ 16 శాతం ఇవ్వాలని, గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరారు. ఏపీజేఏసీ అమరావతి పశ్చిమ గోదావరి జిల్లా ఛైర్మన్ శివశంకర్, సెక్రటరీ ఫణి,ఏపీఆర్‌ఎస్‌ఏ జిల్లా సెక్రటరీ రామ్‌ప్రసాద్, ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకుడు సత్యనారాయణ తదితర నేతలు పాల్గొన్నారు.
