సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంను గెలిపించుకుందామని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. భీమవరం త్యాగరాజ భవనంలో నేడు, బుధవారం జరిగిన ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే అంజిబాబు పాల్గొని మాట్లాడారు. మీ కోసం పని చేసే ప్రతినిధికి అండగా మనందరం నిలవాలని, గ్రాడ్యుయేట్ ఓటర్లు అందరూ ఓటును నమోదు చేసుకుని ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపిఐఐసీ) చైర్మన్, టీడీపి జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజు, ఎపి రాష్ట్ర వినియోగదారుల రక్షణ మండలి చైర్మన్, మాజీ మంత్రి పితల సుజాత, జనసేన ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కోటికలపూడి గోవిందరావు , టీడీపి రాష్ట్ర నాయకులు మెంటే పార్ధసారధి, ఎమ్మెల్సీ చిరంజీవి, బిజెపి నాయకులు కోమటి రవికుమార్, కాగిత సురేంద్ర,జనసేన నేతలు వబిలిశెట్టి రామకృష్ణ, చెనమల్ల చంద్రశేఖర్, బండి రమేష్ టీడీపి నేతలు ఇందుకూరి సుబ్రహ్మణ్య రాజు, మెరగాని నారాయణమ్మ, విజ్జురోతి రాఘవులు, వీరవల్లి చంద్రశేఖర్, ఎంపిపి దుర్గాభవాని, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *