సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శనివారం ఉద్యమ భీమవరం లోని నిర్మల దేవి ఫంక్షన్ హాల్ నందు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు భీమవరం నియోజకవర్గం ఇంఛార్జి గోవిందరావు సభా అధ్యక్షతన ఏర్పాటు చేసిన జనసేన పార్టీ సభలో రాష్ట్ర PAC చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో భీమవరం & ఉండి నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశము యేర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమం లో భీమవరం నియోజకవర్గం వీరవాసరం మండలం నౌడురు గ్రామానికి చెందిన కటిక సురేశ్ ప్రమాదవశాత్తు మరణించిగా వారి కుటుంబసభ్యులకు మరియు ఉంగుటూరు నియోజకవర్గం భీమడోలు మండలానికి చెందిన గొట్టాపు వాసుదేవరావు కుటుంబ సభ్యులకు నాదెండ్ల మనోహర్ పార్టీ తరపున 5 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. దేశంలో పార్టీ సభ్యత్వం తీసుకొంటున్న కార్యకర్తలను ఆదుకొంటున్న ఏకైక పార్టీ జనసేన అన్నారు. సోషల్ మీడియాలో జనసేన కార్యకర్తలు మన పార్టీ గొప్పతనం గురించి ఫొటోలు పెట్టి ప్రచారం చేస్తే లక్షలలో లైక్ లు వస్తాయి తప్ప .. ఓట్లు వెయ్యరని, క్షేత్ర స్థాయిలో ప్రజలతో మమేకం అయ్యి వారి సమస్యలు తెలుసుకొని పార్టీ గురించి ఇంటింటా ప్రచారం చేస్తే ఓట్లు వేస్తారని తెలుసుకోవాలని కీలక వ్యాఖ్యలు చేసారు. పార్టీలో ఇంచార్జి లు గొప్పవారిగా భావించవద్దని, పార్టీలో వివాదాలు వద్దని, ప్రతి ఒక్కరు 10 మందిని పార్టీలోకి తీసుకోని వస్తే గొప్ప సేవ చేసినట్లు అని అన్నారు. ఈనెల లో మచిలీపట్టణం లో పవన్ కళ్యాణ్ హాజరవుతున్న బహిరంగ సభకు క్యాడర్ తరలిరావాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర PAC సభ్యులు కనకరాజు సూరి, బొమ్మిడి నాయకర్ , చేగొండి సూర్యప్రకాష్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నియోజకవర్గాల ఇంఛార్జి లు తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ , ఏలూరు ఇంచార్జ్ రెడ్డి అప్పలనాయుడు చింతలపూడి ఇంచార్జ్ మేక ఈశ్వరయ్య, పోలవరం ఇంచార్జ్ చిరు బాలరాజు ఉంగుటూరు ఇంచార్జ్ పచ్చమట్ల ధర్మరాజు, తణుకు ఇంచార్జ్ విడివాడ రామచంద్రరావు , ఉండి నియోజకవర్గం ఇంచార్జి జుత్తిగా నాగరాజు, zptc గుండా జయ ప్రకాష్ నాయుడు, రాష్ట్ర కార్యదర్శులు ఘంటసాల వెంకటలక్ష్మి ,కారేపల్లి శాంతి ప్రియ, జిల్లా ప్రధాన కార్యదర్శులు చెనమల్ల చంద్రశేఖర్, కరాటం సాయి, గవర లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
