సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో ఇటీవల విడుదల అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా డివైడ్ టాక్ వచ్చినప్పటికీ గత 11 రోజులకు బెనిఫిట్ షో లతో కలపి 61 లక్షల 48 వేల 869 రూపాయలు కలెక్షన్స్ సాధించగా .. జిల్లా వ్యాప్తంగా కలెక్షన్స్ నెమ్మదించాయి. అదే రోజు హిందీ తరువాత తెలుగు వెర్షన్ విడుదలయిన ‘దురంధర్2’ సినిమా గత 11 రోజులకు టౌన్ మొత్తం ఫై 33 లక్షల రూపాయలు వసూళ్లు సాధించి సంచలనం రేపింది. ఇప్పటికి ఈ సినిమా కలెక్షన్స్ రోజువారీ 2 లక్షలు పైగా స్ట్రాంగ్ గా ఉండటం గమనార్హం. పెద్ద మొత్తంలో లాంగ్ రన్ లో వసూళ్లు సాధించే దిశగా డబ్బింగ్ సినిమా దురంధర్ 2 అడుగులు వేస్తుంది. మొత్తానికి భీమవరంలో వెలవెల బోతున్న థియేటర్స్ కు ఈ 2 సినిమాలు మంచి పీడింగ్ ఇచ్చాయి.‘దురంధర్2′ అయితే సంచలన విజయం తో బహుబలి2 మరియు పుష్ప , దంగల్ రికార్డ్స్ ను అధిగమించి 2000 కోట్ల కలెక్షన్స్ దిశగా ప్రపంచ వ్యాప్తంగా అడుగులు వేస్తుంది.
