సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాలకు ఆయువుపట్టు భీమవరం .. ఏ రాజకీయ పార్టీ అయిన సరే జిల్లా అడ్జక్షుడు భీమవరం వారే ఉంటారు. మరి ఇంకో సెంటిమెంట్ ఉంది.. ‘భీమవరం అసెంబ్లీ లో ఏ రాజకీయ పార్టీ ని స్థానిక ప్రజలు గెలిపిస్తే అదే పార్టీ రాష్ట్రంలో కచ్చితంగా అధికారంలోకి వస్తుంది’.ఇది చరిత్ర చెప్పిన సాక్ష్యం.. అంతటి సమర్ధవంతమైన తీర్పు ఇస్తారు భీమవరం ప్రజలు .. ఈ వాస్తవం మరోసారి నిజం కాబోతుందని .. ఓటింగ్ సరళి బట్టి భీమవరంలో ఎమ్మెల్యే గా ‘గ్రంధి శ్రీనివాస్ అనే నేను..’ రాష్ట్రంలో సీఎంగా జగన్ మోహన్ రెడ్డి మరోసారి అధికారంలోకి రాబోతున్నామని నేడు, మంగళవారం మన సిగ్మా న్యూస్ తో, గ్రంధి శ్రీనివాస్ అన్నారు. ఆయన మాటలలో .. నియోజకవర్గం లో అన్ని ప్రాంతాలలో ఓటింగ్ సరళిని బట్టి ఇప్పటికే తన విజయం ఖాయం అయ్యిందని, ఇందులో సందేహం లేదని పెరిగిన ఓటింగ్ శాతం అందులోను భీమవరం పట్టణం లోను గ్రామాలలోను మహిళలు వైసీపీ ఎమ్మెల్యే , ఎంపీ అభ్యర్థులకు బ్రహ్మరధం పట్టారని, ఈ ఎన్నికలలో తమ వైసీపీ క్యాడర్ చాల సమర్ధవంతంగా పనిచేసిందని రిపోర్ట్ ఉందని, ముఖ్యంగా డ్వాక్రా మహిళలు తాము సాదించబోయే విజయంలో కీలక పాత్ర పోషించబోతున్నారని, పోలింగ్ సరళిని బట్టి ఏ రకంగా, ఎవరు నిజాయితీగా సర్వే చేయించిన ” వైసీపీకి మైనస్ ల కన్నా ప్లస్ లే ఎక్కువ’ కనపడుతున్నాయని, ఇటు భీమవరం అటు రాష్ట్రంలో ప్రజలు మెచ్చిన ‘వైసీపీ విజయపతాక ఎగరటం ఖాయం’ గా కనిపిస్తుంది. ఈ వాస్తవం ప్రతిపక్షాలకు కూడా ఇప్పటికే తెలుసు అన్నారు. సీఎం జగన్ ఫై దేశంలో ఎక్కడలేని విధంగా ఎన్ని పార్టీలు కలసి వచ్చిన ప్రజా తీర్పు ఈవీఎంలో నిక్షిప్తం అయ్యిఉండని.. జూన్ 4వ తేదీన ప్రజలు అభిష్టానం నెరవేరుతుందని వైసీపీ శ్రేణులు విజయోత్సవానికి ఉరకలు వేస్తున్నారని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేసారు.
