సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల ఏపీలో వాతావరణ పరిస్థితులు ఎప్పుడు ఎలా మారతాయో ఎవరు చెప్పలేని పరిస్థితి. ఈ వేసవి కాలంలో గత 2 రోజులుగా వర్షాలు పడుతుంటే.. నేడు, గురువారం పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా భీమవరం లో సైతం ఎర్రటి ఎండ ప్రచండంగా ఉంటె మరో పక్క కోనసీమలో పెను గాలులలతో కూడిన వర్షాలు పడ్డాయి. ఇదిలా ఉండగా రాష్ట్రంలో రాబోయే మూడు, నాలుగు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు(గంటకు 30-40 కి.మీ వేగంతో) వడగళ్లతో కూడిన అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నేడు, గురువారం అత్యవసర సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యంగా రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో తీవ్ర ప్రభావం ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. అరటి, మామిడి, మిర్చి, మొక్కజొన్న వంటి పంటలకు నష్టం కలిగే ప్రమాదం ఉందని మంత్రి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *