సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రము జిల్లా ఆర్ధిక రాజధాని భీమవరంలో జాతీయ అంతర్జాతీయ మెగా షో రూమ్ లతో వ్యాపార సంస్థలు ప్రారంబోత్సవాల సందడి బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన, మార్కెట్ ధరలు కన్నా తక్కువ రేట్లకు ఎలక్ట్రానిక్స్ వస్తువులను అందించే ప్రఖ్యాత ఎలక్ట్రానిక్స్ వ్యాపార దిగ్గజం ‘సత్య’ మెగా షో రూమ్ ను నేడు, బుధవారం భీమవరం జేపీ రోడ్డులో ఆ సంస్థ ఎండీ జాన్సన్ ఆసారియా పట్టణ ప్రముఖుల మధ్య వైభవంగా ప్రారంభించారు. అన్ని రంగాలలో అభివృద్ధి చెందిన భీమవరంలో తమ సత్య’37 వ షోరూమ్ ను భారీ ఎత్తున ప్రారంభించడం ఆనందంగా ఉందని, పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు నాణ్యమైన ,ఆధునిక గృహపయోగ ఎలక్ట్రానిక్స్ వస్తువులు ,టీవీలు , లాప్ టాప్లు, మొబైల్ ఫోన్లు మొత్తం డిజిటల్ ప్రపంచాన్ని తక్కువ ధరలకే అందుబాటులోకి తేవడం, మంచి సర్వీస్ అందించడం తమ లక్ష్యం అని, భీమవరంతో పాటు గోదావరి జిల్లాల ప్రజలందరికి ఇదే ఆహ్వానం అని మన సిగ్మా న్యూస్ తో అన్నారు. సత్యలో దసరా మరియు ప్రారంభోత్సవ ఆఫర్ గా ప్రతి కొనుగోలు ఫై ప్రత్యేక బహుమతులు తో పాటూ 50వేలు రూ పైబడి కొనుగోలు కు బంగారు కానుకలు ఇస్తున్నారు.
