సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల రాష్ట్రానికి సమస్యగా భూముల రిజిస్ట్రేషన్ చార్జీల విపరీతంగా పెరిగాయని, వీటిపై తగిన చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ లో ఉప సభాపతి కనుమూరి రఘురామా కృష్ణంరాజు మరియు మరియు సభ్యులను ఉద్దేశించి భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అసెంబ్లీ సమావేశంలో మాట్లాడారు. భీమవరం నియోజక వర్గంలో రిజిస్ట్రేషన్ చార్జీలు విపరీతంగా పెరిగాయని, పొలాలు ఉన్న భూముల రిజిస్ట్రేషన్ చార్జీలు కూడా టౌన్ లో ప్రధాన ప్రాంతాల రెజిస్ట్రేషన్ చార్టీల తరహాలో చార్జీలు నిర్ణయించడం వల్ల .. సుమారు రూ 40 లక్షల విలువ కలిగిన అగ్రికల్చర్ ల్యాండ్ రూ కోటి 70 లక్షలకు పలుకుతుందని, భీమవరంలో రూ 2 కోట్ల ఉండే పొలాన్ని రూ 10 కోట్లకు పెంచే సారని, దీనిని ఎవరికీ అమ్మలా ?లేదా కొనలా తెలియని పరిస్థితిలో అందరూ ఉండిపోయారని అన్నారు. దీని వల్ల రిజిస్ట్రేషన్స్ జరగక ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుందని, వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అంజిబాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
