సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నివాసం వ్యాపార సంస్థలపై మరియు సంజన రియాల్టర్స్ సంస్తలపై గత 5 రోజులుగా జరుగుతున్నా ఐటి దాడులు నేపథ్యంలో కొందరు ఐటీ విధి విధానాలు తెల్సిన మోసగాళ్లు పేక్ కాల్స్ తో ప్రముఖులను వేధిస్తూ బ్లాక్ మెయిల్ కాల్స్ చెయ్యడం ఇటీవల ఎక్కువయింది. భీమవరం చుట్టుపక్కల ప్రాంతాలైన ఆకివీడు, గణపవరం, ఉండి, కాళ్ల, పాలకోడేరు, వీరవాసరం తదితర ప్రాంతాలకు చెందిన సుమారు 40 మంది వ్యాపారులకు ఇలాగే ఫోన్‌ చేసి ఫోన్‌ పే చెయ్యండి అంటూ బెదిరించడం ప్రారంభించారు . అసలు ఆ ఫోన్‌ చేసిన వ్యక్తి ఎవరు ?లేక ఒక ముఠా ఈ పనిచేస్తుందా? భీమవరం ఆదాయ పన్ను శాఖ అధికారి పేరు ఎందుకు చెబుతున్నాడు ? ఏదైనా కార్యాలయంలో పనిచేస్తూ అక్రమ సంపాదన కోసం ఇలా చేస్తున్నాడా ? అన్నది తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు అధికారికంగా ఒక్క ఫిర్యాదు కూడా పోలీసులకు అందలేదుఅని తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *