సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణం నేటి శనివారం మధ్యాహ్నం వరకు ప్రచండమైన ఎండ కాసింది. అయితే సాయంత్రం 4 న్నర గంటలకే సంపూర్ణ సూర్యగ్రహణం తరహాలో ఒక్కసారిగా రాత్రి చీకటి వచ్చేసింది. రోడ్లపై వాహనాలు కు లైటింగ్ లేదు.. దట్టమైన మబ్బులతో ఉరుములు మెరుపులు, ప్రచండ గాలులతో భారీ వర్షం మొదలయ్యింది. దానితోనే పట్టణంలో లోతట్టు ప్రాంతాలతో పాటు ప్రధాన రహదారులపై డ్రైన్స్ నిండిపోయి నీరు పారింది. పిడుగులతో పెను శబ్దాలతో కూడిన కుంభ వృష్టి కురియడంతో విద్యుత్తూ సరఫరా నిలచిపోయింది. నేటి రాత్రి వరకు ఇదే తీరున వర్షం కొనసాగే అవకాశం కనపడుతుంది. విద్యుత్తూ సరఫరా కొనసాగక పొతే ప్రజలు కు ఇబ్బందులు తప్పవు. వాతావరణ శాఖ ముందే సూచించినట్లు నేటి మధ్యాహ్నం నుండి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి.
