సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్ర వ్యాప్తంగా 3 ఎమ్మెల్సీ ల ఎన్నికలు పోలింగ్ నేడు, గురువారం ఉదయం నుండి ప్రశాతంగా జారుతుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు నేపథ్యంలో గోదావరి జిల్లాలో అన్ని నియోజకవర్గాలలో 144 సెక్షన్ విధించారు. భీమవరంలోని పొట్టి శ్రీరాములు గర్ల్స్ హై స్కూల్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూట్ లో రాష్ట్ర శాసనమండలి చైర్మెన్ కొయ్య మోషేను రాజు తన ఓటు హక్కును వినియోగించుకొన్నారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి పట్టభద్రుడు ఓటు హక్కును వినియోగించుకొని నిరుద్యోగుల కోసం,, ఉద్యోగుల హక్కుల కోసం తన గళం విప్పి పోరాడగలిగే అభ్యర్ధికి ఓటు వేసి శాసనమండలికి పంపించాలని పిలుపు నిచ్చారు. భీమవరం లూథరన్ హైస్కూల్ వద్ద కూడా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. కీలకమైన పట్టభద్రుల 2 ఎమ్మెల్సీ స్థానాలకే 67 స్థానాలలో పోలింగ్ జరుగుతుంది. సుమారు 6 లక్షల మంది ఓటర్ లు తమ ఓటు హక్కును వినియోగించుకొంటున్నారు. అయితే కృష్ణ గుంటూరు ఎమ్మెల్సీపోలింగ్ లో అధికార టీడీపీ నేతలు తమపై దాడులు చేసారని పి డి ఎఫ్ నేతలు నిరసనలు తెలిపారు.
