సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరంలో ఈ నెల 10వ తేదీ రాత్రి స్థానిక 18వ వార్డు పెద్ద మసీదు పరిసర ప్రాంతంలో ఓ కుటుంబం లోని నలుగురి పై విచక్షణ రహితంగా కత్తితో దాడికి పాల్బడి వారి గాయాలు కు ఒకరి మరణానికి కారణమైన కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు వన్ టౌన్ సీఐ అడబాల శ్రీను మీడియా కు తెలిపారు. ఏలూరు గన్ బజారు ప్రాంతానికి చెందిన పఠాన్ షేర్ ఖాన్ తన రెండో భార్య షకీలా ఆచూకీ లేకపోవడంతో భీమవరంలోని ఆమె కూతురు అఫీరా ఇంటికెళ్లి ఉండొచ్చని భావించాడు. దానితో ఆ రాత్రి 8గంటల సమయంలో అఫీరా తన తల్లిని దాచిందంటూ ఆ ఇం ట్లోకి చొరబడి కత్తితో ఆమెపై దాడికి దిగాడు. అడ్డువచ్చిన ఆఫీరా మామయ్య షేక్ మెహబూబ్జానీ, అతడి కుమారులు రహీం ,కరీముల్లాపై దాడి చేశారు. ఈ ఘటనలో కత్తిపోట్లకు గురి అయినా మెహబూబ్జానీ విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో ముగ్గురు ప్రస్తుతం చికిత్స పొందుతున్నా రు. ఈ కేసులో నిందితులైన పఠాన్ షేర్ ఖాన్ , భీమవరం 18వ వార్డుకు చెందిన మహ్మద్ ముజీబ్, యాసిన్, దెందులూరు పరిధి సీతం పేటకు చెందిన పఠాన్ అప్రజ్ లను డీఎస్పీ బి.శ్రీనాథ్ ఆధ్వర్యంలో పోలీసులు అరెస్టు చేశారు. వీరిని ప్యూహాత్మకంగా పట్టుకొన్న ఎస్సై ఎం .వెంకటేశ్వరరావు, సిబ్బంది టి.గోవిందరాజు, ఐవీ సుబ్బారావు, జి.రామకృష్ణలను ఎస్పీ రవి కుమార్ అభినందించారని సీఐ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *