సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం వన్ టౌన్ CI ఎం నాగరాజు నేడు, మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో.. గత నెల ది. 26.11.2025 వ తేదీన సాయంత్రం సుమారు 5 గంటలకు భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి లోని, చిన్నరంగనిపాలెం సెంటర్ లో ఉన్న శ్రీ రాఘవేంద్ర బెంగళూరు అయ్యంగర్ బేకరీ ఎదురుగా రోడ్డుపై కొందరు విద్యార్థులు బస్సు ఎక్కడానికి నిలబడి ఉండగా అదే సమయంలో అక్కడికి రెండు మోటర్ సైకిళ్ళ పై నలుగురు వ్యక్తులు వచ్చి, వారిలో ఇద్దరు వ్యక్తులు కత్తులతో అక్కడ విద్యార్థులను బెదిరించి దౌర్జన్యంగా వాళ్ళ వద్ద ఉన్న డబ్బులు ఇవ్వకుంటే చంపేస్తామని బెదిరిస్తూ స్వైర విహారం చేస్తూ ఆ చుట్టూ ప్రక్కల ప్రజలని, కూడా భయబ్రాంతులకు గురి చేసిన ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. కత్తులు ఉపయోగించిన ఇద్దరు నిందితులను స్థానిక చినరంగనిపాలెం పుంత ఏరియాకి చెందిన కోలా ఆనంద్ మరియు కోలా ప్రకాష్ లు గా గుర్తించి వారిని నిన్న సోమవారం ది. 01.12.202 తేదీన సాయంత్రం 5 గంటలకు అరెస్ట్ చేసి ఈ రోజు మంగళవారం కోర్టు లో హాజరు పరచగా కోర్ట్ వారికి 14 రోజులు రిమాండ్ విధించినది. మిగిలిన ఇద్దరి వ్యక్తులను త్వరలో పట్టుకోవడం జరుగుతుంది అని తెలిపారు. ఎవరు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేసారు. ఈ కార్యక్రమంలో భీమవరం వన్ టౌన్ SI B.Y. కిరణ్ కుమార్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
